మోదీ కామెంట్స్ దీదీ సీరియస్
రాహుల్ రెండు చోట్ల నామినేషన్
పశ్చిమ బెంగాల్ – టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించారు. ఈ సందర్బంగా ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాహుల్ ను వ్యక్తిగతంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు మమతా బెనర్జీ. తనకు ఒక రూల్, ఇతరులకు మరో రూల్ అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు.
ఇకనైనా ప్రధానమంత్రి తన స్థాయి ఏమిటో గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. విచిత్రం ఏమిటంటే గత ఎన్నికల్లో మోదీ తాను కూడా రెండు చోట్ల నుండి పోటీ చేసిన విషయాన్ని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఒకరికి చెప్పేందుకే నీతులు పనికి వస్తాయని ఆయనను చూస్తే తెలుస్తుందన్నారు.
రాహుల్ గాంధీ రెండు చోట్ల నామినేషన్ వేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు నరేంద్ర మోదీ. తన మీద తనకు నమ్మకం లేకనే ఇలా రెండు చోట్ల బరిలో నిలిచాడంటూ ఎద్దేవా చేశారు. దీనిపై సీరియస్ అయ్యింది దీదీ.