తళపతి విజయ్ సరసన మమిత బైజు
సంతోషంగా ఉందన్న ప్రముఖ నటి
తమిళనాడు – ప్రముఖ తమిళ సినీ నటుడు తళపతి విజయ్ తో కలిసి నటించనున్నారు ప్రేమలు సినిమా ఫేమ్ మమిత బైజు. ఈ విషయాన్ని మంగళవారం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తనే వెల్లడించారు. దేశంలోనే మోస్ట్ ఫెవరబుల్ యాక్టర్ గా గుర్తింపు పొందిన విజయ్ తో నటించ బోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తనకు తనలో కలిసి నటించే అవకాశం కల్పించినందుకు తళపతికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొంది మమిత బైజు.
ఇదిలా ఉండగా తళపతి తన సినీ కెరీర్ లో ఇదే ఆఖరి సినిమా అన్న ప్రచారం జరుగుతోంది. తను వచ్చే ఎన్నికల బరిలో ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ మేరకు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. తరుచూ సమావేశాలు నిర్వహిస్తూ విద్య, ఆరోగ్యం ప్రాధాన్యత గురించి పదే పదే చెబుతూ వస్తున్నారు తళపతి విజయ్.
ఇంకా సినిమా పేరు ఖరారు కానీ ఈ ప్రాజెక్టుకు తళపతి 69 అని పేరు కూడా పెట్టారు. దీనికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటించేందుకు మమిత బైజును సంప్రదించినట్లు టాక్ . ఇవాళ అనుమానాలకు తెర దించుతూ ప్రకటన చేసింది స్వయంగా బైజు.