DEVOTIONAL

11 నుండి 17 వ‌ర‌కు మ‌న గుడి కార్య‌క్ర‌మాలు

Share it with your family & friends

తెలుగు రాష్ట్రాల్లోని శివాల‌యాల‌లో పూజ‌లు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది. ప్ర‌స్తుతం కార్తీక మాసం కావ‌డంతో ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల‌లో ఎంపిక చేసిన శివుడు, పార్వ‌తి కొలువు తీరిన ఆల‌యాల‌లో విశిష్ట పూజా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు టీటీడీ ఈవో జె. శ్యామ‌లా రావు వెల్ల‌డించారు. బుధ‌వారం ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఇందులో భాగంగా నవంబరు 11 నుండి 17వ తేది వరకు తెలుగు రాష్ట్రాల్లో ‘మన గుడి’ కార్తీక మాస కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాల‌యాల్లో మనగుడి కార్యక్రమం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు ఈవో.

ఇందులో భాగంగా ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో జిల్లాకు ఒక‌టి చొప్పున ఎంపిక చేసిన శివాల‌యాల‌్లో 7 రోజుల పాటు కార్తీక‌మాస విశిష్ట‌త‌పై ధార్మికోప‌న్యాసాలు నిర్వ‌హిస్తారు.

ఒక్కో జిల్లాలో 2 చొప్పున ఆల‌యాల‌ను ఎంపిక చేసి న‌వంబ‌రు 13న కైశిక ద్వాద‌శి ప‌ర్వ‌దిన కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. జిల్లాకు ఒక‌టి చొప్పున ఎంపిక చేసిన శివాల‌యాల్లో న‌వంబ‌రు 15న కార్తీక దీపోత్స‌వం కార్యక్రమం చేప‌డ‌తారు.