ఏదీ చెందనప్పుడు ఎందుకింత బాధ
మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – మంచు మోహన్ బాబు కూతురు నటి మంచు లక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వారి కుటుంబం బజారున పడింది. ఆస్తుల కోసం తన్నుకునే పరిస్థితి నెలకొంది. ఒకరిపై మరొకరు తండ్రీ కొడుకులు ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ తరుణంలో ప్రపంచంలో మంచు లక్ష్మీ చేసిన ప్రయత్నాలేవీ ఫలించ లేదు. చివరకు తను కూడా రిక్త హస్తంతో ముంబైకి వెళ్లి పోయింది. తట్టుకోలేక ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు వేదాంత ధోరణితో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మోహన్ బాబు కుటుంబం గురించి..ఏదీ నీకు చెందినది కానపుడు… ఏదో కొల్పోయాననే బాధ ఎందుకు అంటూ పేర్కొంది.
అంటే అర్థం ఇక్కడికి వచ్చాక మనం ఏదీ తీసుకు వెళ్లలేమని, ఉన్న కొన్నాళ్ల పాటైనా కలిసి మెలిసి ఉండాలని సూచించింది. నిత్యం క్రమశిక్షణ గురించి పదే పదే ప్రస్తావించే నటుడు మోహన్ బాబు చివరకు తన కుటుంబాన్ని కంట్రోల్ పెట్టలేక పోయాడనే అపవాదు మూటగట్టుకున్నాడు. అంతే కాదు దురుసు ప్రవర్తన, మితిమీరిన అహంకారం, చివరకు మీడియాపై దాడి ..ఇలా ప్రతీదీ వివాదాస్పదంగా మారింది.