మహేష్ భగవత్ ను కలిసిన మనోజ్..మౌనిక
తమకు రక్షణ కల్పించాలని విన్నపం
హైదరాబాద్ – మంచు మనోజ్, మౌనిక అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్‌ను కలిశారు. తమ కుటుంబంలో గొడవల దృష్ట్యా తమకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో రాచకొండ సీపీని కలవాలని సూచించారు. ఇదిలా ఉండగా మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు.
తనను అల్లారు ముద్దుగా పెంచానని, చదువుకునేందుకు ఖర్చు చేశానని అన్నారు. కానీ నా గుండెల మీద తన్నావంటూ వాపోయారు. భార్య మాటలు విని చెడి పోయావంటూ మండిపడ్డారు. మందుకు బానిస అయ్యావని, చెడు మార్గంలో వెళ్లావంటూ హితవు పలికారు. కొన్ని కారణాల వల్ల గొడవ పడ్డామని, మనసులో ఏదీ పెట్టుకోకుండా కలిసి ఉందామంటూ పిలుపునిచ్చారు.
అయితే మంచు మనోజ్ తనను కొట్టలేదని అన్నారు. ఇదంతా దుష్ప్రచారం అంటూ కొట్టి పారేశారు మంచు మోహన్ బాబు.