మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు..?
ఒకరిపై మరొకరు ఫిర్యాదుల పర్వం
హైదరాబాద్ – ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తీవ్ర గాయాలతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. తనతో పాటు తన భార్యపై కూడా దాడికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. తనను తన తండ్రి కొట్టించాడని వాపోయారు.
ఇదిలా ఉండగా మంచు మోహన్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఎదిరించడమే కాకుండా , ఏకంగా తనతో పాటు తన భార్య అని చూడకుండా దాడికి పాల్పడ్డారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. తను కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. తండ్రీ కొడుకులు మోహన్ బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి ప్రధాన కారం స్కూల్, ఆస్తుల వ్యవహారమేనని సమాచారం. తండ్రీ కొడుకుల వ్యవహారం, గొడవలపై ఇంకా తెలుగు సినిమా రంగానికి చెందిన వారు ఎవరూ స్పందించ లేదు. ఇది ఆస్తుల, వ్యక్తిగత విషయమని తాము జోక్యంఉ చేసుకునే పరిస్థితి లేదని వారు పేర్కొన్నారు.