దాడి బాధాకరం మా నాన్న దేవుడు
నటుడు మంచు మనోజ్
హైదరాబాద్ – నటుడు మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్న అనంతరం మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్బంగా బుధవారం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. తను కన్నీటి పర్యంతం అయ్యాడు.
తన తండ్రి మోహన్ బాబు దేవుడని అన్నారు.ఇదే సమయంలో మీడియాపై దాడి చేయడం తనను మరింత బాధకు గురి చేసిందన్నాడు. ఇది ఎంత మాత్రం సరి కాదన్నారు. ఇలాంటి దుందుడుకు చర్యలు జనంలో మరింత చులకనయ్యేలా చేస్తాయని అన్నాడు.
తన భార్య, కూతురును ఈ వివాదంలోకి లాగడం మంచి పద్దతి కాదన్నారు. తాను స్వంత కాళ్ల మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నానని, ఎవరి ఆస్తి కావాలని కోరలేదని చెప్పాడు మంచు మనోజ్ . తన తండ్రిని అన్న విష్ణు, వినయ్ ట్రాప్ చేశారని ఆరోపించారు. తనను శత్రువుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని మండిపడ్డాడు . ఇకనైనా ఇలాంటి చర్యలకు పుల్ స్టాప్ పెట్టాలని కోరాడు.