స్పష్టం చేసిన మంచు మనోజ్
హైదరాబాద్ – తండ్రీ కొడుకుల మధ్య మరోసారి వార్ మొదలైంది. మోహన్ బాబు, మంచు విష్ణులపై షాకింగ్ కామెంట్స్ చేశారు మంచు మనోజ్. తన పోరాటం వారిద్దరి మీద కాదన్నారు. న్యాయం కోసం తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. తమ విద్యా సంస్థల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాపోయారు. వాళ్ల తరపున తాను న్యాయం కావాలని కోరుతున్నానని అన్నారు. నాన్నను అడ్డం పెట్టుకుని తన అన్న నాటకం ఆడుతున్నాడని ఆరోపించారు.
మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ఆస్తుల తగాదాలు లేనే లేవని అన్నారు. ఇదంతా కావాలని ఆడుతున్న నాటకంగా కొట్టి పారేశారు. తాను గేటు ఎక్కి దూకానని, ఎవరినో కొట్టానని చెప్పడం శుద్ద అబద్దమని కొట్టి పారేశారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.
ఇదిలా ఉండగా తండ్రీ కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ ల మధ్య తారా స్థాయికి చేరుకున్నాయి విభేదాలు. జల్ పల్లి ఫామ్ హౌస్ వద్ద ఓ రిపోర్టర్ పై దారుణంగా దాడికి పాల్పడ్డాడు మోహన్ బాబు. తనపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు కోర్టు. ప్రస్తుతం అజ్ఞాతంలో కొనసాగుతున్నాడు నటుడు.