పోలీసుల పక్షపాతం మనోజ్ ఆగ్రహం
ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నా
హైదరాబాద్ – నటుడు మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి సంబంధించిన గొడవల విషయంపై ఆయన స్పందించారు. మంగళవారం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఆయన పహాడి షరీఫ్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ మనుషులను బయటకు పంపించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రక్షణ కావాలని కోరానని, ఫిర్యాదు చేశానని చెప్పారు.
తాను డబ్బు కోసమో లేదా ఆస్తి కోసం పోరాటం చేయటం లేదన్నారు నటుడు మంచు మనోజ్… ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని చెప్పారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదన్నారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం అందరిని కలుస్తానని అన్నారు. తన భార్యా పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. న్యాయం కోసం అందుకే పోరాటం చేస్తున్నానని చెప్పారు మంచు మనోజ్. పోలీస్ శాఖ ఎందుకు ఒన్ సైడ్ నిర్ణయం తీసుకుంటున్నారని ప్రశ్నించారు.