తమను చంపేందుకు కుట్ర – మనోజ్
సోదరుడిపై షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – రామ్ గోపాల్ వర్మ మాఫియా పై తీసిన సినిమాను మించి రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం. నిన్నటికి నిన్న రాచకొండ సీపీ సుధీర్ బాబు ఫుల్ కోటింగ్ ఇచ్చారు తండ్రీ కొడుకులకు. ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. ఇద్దరి వద్ద వెపన్స్ తమకు సరెండర్ చేయాలని ఆదేశించారు.
కానీ ఇప్పటి వరకు చేయక పోవడంతో మరోసారి పోలీసులు మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. కానీ ఆయన కనిపించకుండా గాయబ్ అయ్యారు. చివరకు సీపీ సీరియస్ గా స్పందించడంతో సాయంత్రానికల్లా ఇస్తానంటూ చెప్పారు.
యావత్ మీడియా లోకం క్షమాపణలు చెప్పాలని ధర్నాలు, ఆందోళనలు ఉధృతం చేయడంతో గత్యంతరం లేక మోహన్ బాబు, విష్ణు రిపోర్టర్ రంజిత్ ను ఆస్పత్రిలో సందర్శించారు. ఇదిలా ఉండగా మరోసారి సోదరుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
మంచు మనోజ్ , మౌనికా రెడ్డి కలిసి మరోసారి మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు. జనరేటర్ లో చక్కెర కలిపిన డీజిల్ పోశారంటూ ఆరోపించారు. విద్యుత్ సరఫరా నిలిచి పోయిందంటూ వాపోయారు. తన తల్లి, తొమ్మిది నెలల పాపతో పాటు బంధువులు సైతం తీవ్ర ఇబ్బంది పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విష్ణు స్పందించ లేదు.