మోహన్ బాబు..విష్ణు గన్స్ సీజ్
ఆదేశించిన రాచకొండ సీపీ
హైదరాబాద్ – మంచు మనోజ్ , మోహన్ బాబు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునేంత దాకా వెళ్లాయి. మీడియాపై రెచ్చి పోయారు మోహన్ బాబు. మరో వైపు తనను రాకుండా గేటు వేయడంతో తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నం చేశారు మంచు మనోజ్.
ఇదిలా ఉండగా మంచు మోహన్ బాబు, విష్ణు ఇప్పటికే జూబ్లీ హిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందారు. దీంతో పరిస్థితి చేయి దాటి పోవడంతో రాచకొండ పోలీస్ కమిషనర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు నటుల వద్ద ఉన్న తుపాకుల లైసెన్సులను సీజ్ చేయాలని పహారీ షరీఫ్ పోలీసులను ఆదేశించారు.
దీంతో హుటా హుటిన అక్కడికి చేరుకున్నారు. మొత్తం మోహన్ బాబు ఇంటిని పోలీసులు చుట్టు ముట్టారు. ఓ వైపు మోహన్ బాబు, విష్ణుకు చెందిన బౌన్సర్లు మరో వైపు మంచు మనోజ్ కు చెందిన బౌన్సర్ల మధ్య ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా రెచ్చి పోయిన మోహన్ బాబు ఓ టీవీ ఛానల్ కు చెందిన లోగోను తీసుకుని దాడి చేసేందుకు యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.