దాడి ఘటన చిన్న సంఘటన
నటుడు మంచు విష్ణు కామెంట్
హైదరాబాద్ – నగర శివారు లోని జల్ పల్లిలో జరిగిన ఘటనపై స్పందించారు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదో చిన్న సంఘటన జరిగితే ఏదేదో జరిగి పోయినట్టు రాద్దాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మనోజ్ వైఫ్ వెనుక రాజకీయ కోణం ఉందంటూ పేర్కొన్నారు. తన తండ్రి మోహన్ బాబు సూపర్ అంటూ పేర్కొన్నారు. ఆయన నిక్కచ్చిగా ఉంటాడని కితాబు ఇచ్చారు. అంతే కాదు ఆయన అటిట్యూడ్ అంతేనని స్పష్టం చేశారు. ఆ టైమ్ లో కోపంలో ఉన్నారని చెప్పారు.
తాను చాలాసార్లు చెప్పానని, కానీ తను మారలేదని అన్నారు మంచు విష్ణు. చిన్న ఘటన జరిగితే రాద్దాంతం చేస్తారా అని ప్రశ్నించారు. ఇలా చేస్తారని తాను అనుకోలేదన్నారు. ఈ మీడియా ఇలా డ్యామేజ్ చేస్తుందని తాను అనుకోలేదంటూ బాంబు పేల్చారు. తాము తోపు ఫ్యామిలీ అంటూ పేర్కొన్నారు.
విలువలతో తాము పెరిగామని, దీనిపై ఇంకెక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.