ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ – మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) చీఫ్ మందకృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ తో పాటు ఇతర న్యాయమూర్తులకు తల వంచి నమస్కారం చేస్తున్నానని తెలిపారు.
తీర్పు వెలువరించిన అనంతరం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. ఈ కీలక తీర్పు సంచలనంగా మారిందన్నారు. ఆనాడు వర్గీకరణకు సీఎం చంద్రబాబు నాయుడు చేశారని , ఇవాళ కూడా సీఎంగా ఉన్నారని ప్రశంసించారు.
ఇదే సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కుమార్ కు, ఎంపీలు ఈటల రాజేందర్ , రఘునందన్ రావు తో పాటు ప్రజా సంఘాలకు, తమ పోరాటానికి మద్దతు ఇచ్చిన వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో 30 ఏళ్లుగా ఈ పోరాటాన్ని చేస్తూ వచ్చానని, ఎందరో ఈ పోరులో రాలి పోయారని ప్రశంసించారు.
ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.