జీవీఎల్ కు మందకృష్ణ మాదిగ థ్యాంక్స్
తమ పోరాటానికి బాసటగా నిలిచారని కితాబు
న్యూఢిల్లీ – ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ భారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం తాము చేసిన పోరాటానికి బేషరతుగా తను మద్దతు తెలిపారని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఇటీవల ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ విద్యా , ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇదిలా ఉండగా జీవీఎల్ నరసింహారావు తొలి నుంచీ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ గురించి పదే పదే పార్లమెంట్ లో ప్రస్తావించారని గుర్తు చేశారు మందకృష్ణ మాదిగ.
తమ పోరాటానికి నైతికంగా మద్దతు తెలిపారని ప్రశంసించారు. ఆదివారం స్వయంగా న్యూ ఢిల్లీలోని జీవీఎల్ నివాసంకు వెళ్లి ఆయనకు మందకృష్ణ మాదిగ స్వీట్ తినిపించారు. .
జీవీఎల్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేశాడని మంద కృష్ణను ప్రశంసించారు. ఆయన చేసిన పోరాటానికి దక్కిన ఫలితమే ఈ తీర్పు అని పేర్కొన్నారు.