NEWSTELANGANA

ప్ర‌ధాని మోడీకి స‌లాం – మంద‌కృష్ణ‌

Share it with your family & friends

ఎంఆర్పీఎస్ చీఫ్ కామెంట్స్

న్యూఢిల్లీ – ఎస్సీ, ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ స‌బ‌బే అని సంచ‌ల‌న తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు. మాదిగ‌లు కూడా మ‌నుషులేన‌ని , వారికి స‌మాన‌మైన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని కోరుతూ అలుపెరుగ‌ని రీతిలో పోరాటం చేస్తూ వ‌చ్చారు మాదిగ రిజర్వేష‌న్ పోరాట స‌మితి (ఎంఆర్పీఎస్) చీఫ్ మంద‌కృష్ణ మాదిగ .

ఇవాళ కీల‌క‌మైన తీర్పు వెలువ‌రించినందుకు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇదే స‌మ‌యంలో త‌మ 30 ఏళ్లుగా మాదిగ‌లు చేస్తున్న అలుపెరుగ‌ని పోరాటానికి దక్కిన గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.

త‌మ న్యాయ ప‌ర‌మైన , ధ‌ర్మ బద్ద‌మైన పోరాటానికి బేష‌ర‌తు మ‌ద్ద‌తు తెలిపిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి రుణ‌ప‌డి ఉన్నామ‌ని అన్నారు మంద‌కృష్ణ మాదిగి. ఇదే స‌మ‌యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు, కేంద్ర మంత్రులు అమిత్ షా, గంగాపురం కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ తో పాటు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు , ఎంపీలు ర‌ఘునంద‌న్ రావు, ఈట‌ల రాజేంద‌ర్ , కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ఎంఆర్పీఎస్ చీఫ్‌.