Monday, April 7, 2025
HomeNEWSఅన్ని కులాల‌కు స‌మ న్యాయం జ‌ర‌గాలి

అన్ని కులాల‌కు స‌మ న్యాయం జ‌ర‌గాలి

ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ

హైద‌రాబాద్ – రాష్ట్రంలో అన్ని కులాలకు సమన్యాయం జరిగేలా చూడాలని అన్నారు ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ‌. ఏకసభ్య కమిషన్ చైర్మన్ ను కలిసాశామ‌న్నారు. వర్గీకరణ పై షమీమ్ అక్తర్ రిపోర్ట్ సరిగా చూడకుండా క్యాబినెట్ ఆమోదించింద‌ని అన్నారు. పూర్తి చర్చ జరగకుండా ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసిందన్నారు. కమిషన్ రిపోర్టు లో లోపాలు సరి చేయాలని సీఎం కు కూడా సూచించామ‌న్నారు. తాము చెప్పిన అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్నార‌ని, అందుకే క‌మిష‌న్ గ‌డువు పెంచార‌ని చెప్పారు.

క‌మిష‌న్ చైర్మ‌న్ ను క‌లిసిన అనంత‌రం మంద‌కృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు. గ‌డువు పెంచినందుకు సీఎంకు, ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ నివేదికలో ఉన్న లోపాలను కమిషన్ కు చదివి వినిపించామ‌న్నారు.హేతుబద్ధత, న్యాయ సమ్మతంగా జరపాలని సుప్రీం కోర్టు సూచించిందన్నారు.

అవి ప్రస్తుత కమీషన్ నివేదికలో మిస్ అయ్యాయని తెలియ చేశామ‌న్నారు మంద‌కృష్ణ మాదిగ‌. అత్యంత వెనుకబడిన కులలైనా బుడగ జంగం, డక్కలి, మాంగ్ వంటి కులాలను అభివృద్ధి చెందిన పంబాల, మన్నె కులాలతో కలిపి వారికి ఒక శాతం రిజర్వేషన్ కేటాయించార‌ని చెప్పారు.

దీనివల్ల వెనుకబడిన కులాలు మళ్ళీ దోపిడీకి గురవుతాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అత్యంత వెనుకబడిన కులాల వారికి 171625 జనాభాను ప్రామాణికంగా తీసుకుని 1 శాతం రిజ‌ర్వేష‌న్ కేటాయించార‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments