Tuesday, April 22, 2025
HomeNEWSNATIONALకేజ్రీవాల్ అంటే కేంద్రానికి భ‌యం - సిసోడియా

కేజ్రీవాల్ అంటే కేంద్రానికి భ‌యం – సిసోడియా

నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ సీఎం

ఢిల్లీ – మాజీ ఉప ముఖ్య‌మంత్రి, ఆప్ సీనియ‌ర్ నాయ‌కుడు మ‌నీష్ సిసోడియా కేంద్రంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా గ‌త 10 ఏళ్ల నుంచీ ఆమ్ ఆద్మీ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నార‌ని, కానీ వారి కుట్ర‌లు, ప్లాన్స్ వ‌ర్క‌వుట్ కాలేద‌న్నారు.

భ‌విష్య‌త్తులో ఎన్ని కుట్ర‌లు చేసినా వారు ఎన్న‌టికీ స‌క్సెస్ కాలేర‌ని అన్నారు మ‌నీష్ సిసోడియా. ఆయ‌న ప్ర‌త్యేకంగా సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అరవింద్ కేజ్రీవాల్ 9.5 ఏళ్లుగా సీఎంగా ఉన్నారు,

గత 7.5 ఏళ్లలో ఆయన ఎన్నో పనులు చేశారు. బీజేపీ మాత్రం 20 ఏళ్లుగా సీఎంలు ఉన్న చోట అంతే పని చేయలేక పోయిందంటూ ఎద్దేవా చేశారు మ‌నీష్ సిసోడియా.

కేంద్రానికి, భార‌తీయ జ‌న‌తా పార్టీకి, ఆర్ఎస్ఎస్, విహెచ్ పీ , భ‌జ‌రంగ్ ద‌ళ్ సంస్థ‌ల‌కు అరవింద్ కేజ్రీవాల్ అంటే గిట్ట‌ద‌న్నారు. త‌ప్పుడు కేసుల‌లో ఇరికించి జైళ్లో పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం. పాద‌యాత్ర సంద‌ర్బంగా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments