జైలు జీవితం నేర్పిన పాఠం – సిసోడియా
చెరసాల అనేది ప్రతి ఒక్కరికీ ఒక్కటే
ఢిల్లీ – ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన జైలు జీవితం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జైలుకు వెళ్లడం వల్ల తాను చాలా నేర్చు కోవడం జరిగిందని చెప్పారు.
జైలు అనేది భిన్నంగా ఏమీ ఉండదన్నారు. జైలు అనేది ప్రతి ఒక్కరికీ ఒకటేనని అన్నారు మనీష్ సిసోడియా. జైలుకు వెళ్లడం వల్ల జైలు వ్యవస్థను అర్థం చేసుకునే అవకాశం తనకు లభించిందని చెప్పారు మాజీ డిప్యూటీ సీఎం.
ఇంతకు ముందు తాను అధికారిక సందర్శనల సమయంలో ఎప్పుడూ జైళ్లకు వెళ్లే వాడినని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను ఎక్కువగా వారి సమస్యలను తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.
కానీ తాను 17 నెలల పాటు తీహార్ జైలులో ఉండడం వల్ల వివిధ కారణాల రీత్యా జైలు జీవితం అనుభవిస్తున్న వారితో మాట్లాడే ఛాన్స్ తనకు దక్కిందన్నారు. దీని వల్ల వారి ఇబ్బందులు, సమస్యలు ఏమిటో తెలిసిందన్నారు మనీష్ సిసోడియా.
కేంద్రం ఎన్ని కుట్రలు పన్నినా చివరకు సత్యమే గెలుస్తుందని అన్నారు మాజీ డిప్యూటీ సీఎం.