స్వేచ్ఛకు జై రాజ్యాంగానికి జై జై
17 నెలల తర్వాత భార్యతో సిసోడియా
ఢిల్లీ – ఆప్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన 17 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన తొలిసారిగా భార్యతో కలిసి టీ సేవించారు. ఇందుకు సంబంధించి ఫోటోలను షేర్ చేశారు సామాజిక మాధ్యమాల వేదికగా .
ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏదో ఒక రోజు తాను నిర్దోషిగా విడుదలై వస్తానన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఇవాళ భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం తన విషయంలో ఇచ్చిన తీర్పు ఎందరికో స్పూర్తి దాయకంగా ఉంటుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు సిసోడియా.
ఒక రకంగా తనతో పాటు తమ నాయకుడు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా తప్పుడు ఆరోపణలతో జైలుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేహారు మాజీ డిప్యూటీ సీఎం. ఈ సుదీర్ఘ కాలం పాటు తాను పుస్తకాలతో గడిపానని, ఎలా విద్యా పరంగా ఏం చేయవచ్చనే దానిపై ఆలోచించానని తెలిపారు మనీష్ సిసోడియా.
భారతీయులైన మనందరికీ జీవించే హక్కును ప్రసాదించింది భారత రాజ్యాంగమని, దానికి తాను రుణపడి ఉన్నానని స్పష్టం చేశారు.