NEWSNATIONAL

నియంత కుట్ర‌లు చెల్లవు

Share it with your family & friends

మ‌నీష్ సిసోడియా కామెంట్

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉన్నారు ఆప్ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, మాజీ మంత్రి స‌త్యేంద్ర జైన్. అంతే కాదు తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజ‌య్ సింగ్ బెయిల్ పై విడుద‌ల‌య్యారు.ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున జ‌నం స్వాగ‌తం ప‌లికారు.

ఇదిలా ఉండ‌గా జైలులో నుంచి మ‌నీష్ సిసోడియా కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నారు. కేవ‌లం ఆప్ కు జ‌నాద‌ర‌ణ పెరుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ క‌క్ష క‌ట్టార‌ని ఆరోపించారు. అయినా నియంత‌కు ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ మోదీకి ఉన్నాయంటూ మండిప‌డ్డారు.

ఆయ‌న సీఎం కేజ్రీవాల్ ను జైలులో పెట్టి ల‌బ్ది పొందాల‌ని చూశార‌ని, కానీ సింహం లాంటోడు సీఎం అని పేర్కొన్నారు. ఇవాళ ప్ర‌జ‌లు త‌మ నాయ‌కుడిని సీఎంగా చూడ‌డం లేద‌ని , స్వంత కొడుకుగా చూసుకుంటున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఏదో ఒక రోజు మోదీ నియంతృత్వానికి కాలం స‌రైన రీతిలో స‌మాధానం ఇవ్వ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.