గాంధీ కుటుంబంపై అయ్యర్ గరం
బీజేపీకి వెళ్లే ప్రసక్తి లేదని ప్రకటన
కేరళ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తను నిఖార్సయిన గాంధేయవాదినని స్పష్టం చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన అయ్యర్ పార్టీపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
సోనియా గాంధీని కలిసేందుకు ఛాన్స్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు మణిశంకర్ అయ్యర్. ఇదే సమయంలో ఒకటి రెండు సార్లు మాత్రమే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశానని అన్నారు. అలాగని తాను బీజేపీలోకి వెళ్లే ప్రసక్తి లేదని కుండ బద్దలు కొట్టారు.
తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని అన్నారు. విచిత్రం ఏమిటంటే తమ పార్టీలో ఏం జరుగుతుందో ఇప్పటికీ తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అయ్యర్. విచిత్రం ఏమిటంటే గత 10 సంవత్సరాలుగా సోనియా గాంధీని ఒకరితో ఒకరు కలిసే అవకాశం తనకు ఇవ్వక పోవడం బాధకు గురి చేసిందన్నారు .
రాహుల్ గాంధీతో అర్థవంతమైన సమయాన్ని గడిపే అవకాశం ఒక్కసారి తప్ప తనకు ఇవ్వలేదన్నారు. ఇక ప్రియాంక గాంధీతో ఒకటి రెండు సార్లు కలుసుకున్నట్టు తనకు గుర్తుందన్నారు. ఏమైనా అవసరం అనుకుంటే తను ఫోన్ చేస్తుందన్నారు మణిశంకర్ అయ్యర్.
నా జీవితంలోని హాస్యాస్పదం ఏమేమిటంటే నా రాజకీయ జీవితం గాంధీలచే తయారు చేయబడిందని, కానీ గాంధీలతో చేయ బడలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.