మాండవీయ మరోసారి
కేంద్ర కేబినెట్ లోకి
న్యూఢిల్లీ – ఎన్డీయే – బీజేపీ కేబినెట్ కొలువు తీరనుంది. ఇప్పటికే మోడీ , అమిత్ షా కసరత్తు పూర్తి చేశారు. గత కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవిని చేపట్టారు మన్సూఖ్ మాండవీయ. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.
ఆయన పూర్తి పేరు మన్సుఖ్ లక్ష్మణ్ భాయ్ మాండవీయ. 2001 నుండి 2024 వరకు ఆరోగ్య శాఖతో పాటు రసాయనాలు, ఎరువుల శాఖను కూడా నిర్వహించారు. గుజరాత్ నుండి గెలుపొందారు. మోడీకి అత్యంత నమ్మకస్తుడు.
మాండవీయ గుజరాత్ రాష్ట్రంలోని భావ్ నగర్ జిల్లా పాలిటానా తాలూకా లోని హనోల్ అనే చిన్న ఊరులో పుట్టాడు. మధ్య తరగతి రైతు కుటుంబం ఆయనది. నలుగురు సోదరులలో చిన్నవాడు. రాజకీయ శాస్త్రంలో ఎంఏ చదివారు. 2021లో గుజరాత్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ రీసెర్చ్ నుండి పీహెచ్ డీ చేశారు మన్సూఖ్ .
ఇక పదవుల పరంగా చూస్తే 2002- 2007 వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2010లో గుజరాత్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా పని చేశాడు. 2012 – 2018 వరకు రాజ్య సభ సఢ్యుడిగా ఉన్నారు. 2015లో గుజరాత్ బీజేపీలో అతి పిన్న వయసు కలిగిన కార్యదర్శిగా పని చేశాడు. 2016 -19 వరకు రోడ్లు భవనాల శాఖగా పని చేశారు. 2018లో తిరిగి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2019లో ఓడ రేవులు, షిప్పింగ్ , జల మార్గాల మంత్రిగా పని చేశాడు మాండవీయ.