సీఎంను కలిసిన అహ్లూవాలియా
ప్రణాళికా సంఘం మాజీ అధ్యక్షుడు
హైదరాబాద్ – ప్రముఖ ఆర్థిక వేత్త , ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెంక్ సింగ్ అహ్లూవాలియా శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు సీఎం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశం అయ్యారు.
రాష్ట్రంలో గత పదేళ్ల పాలనలో చోటు చేసుకున్న పరిస్థితులు, చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు ఆర్థికవేత్త అహ్లూవాలియా. భారీగా పెరిగిన అప్పులు, వాటి ప్రభావం, ఆరు గ్యారెంటీల అమలు గురించి వివరించారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.
అంతే కాకుండా కాంగ్రెస్ పాలనలో దేశంలో అనుసరించిన ఆర్థిక సంస్కరణలు, వివిధ అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చాయి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలనే దానిపై పలు సూచనలు చేశారు ప్రపంచ ఆర్థిక వేత్త డాక్టర్ మాంటెంక్ సింగ్ అహ్లూవాలియా.