రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకున్న ఘటన
ఢిల్లీ – ఇండియన్ ఇంటర్నేషనల్ షూటర్ మనూ బాకర్ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆదివారం ఉదయంం జరిగిన రోడ్డు ప్రమాదంలో షూటర్ అమ్మమ్మతో పాటు మామ ప్రయాణిస్తున్న కారు ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో అమ్మమ్మతో పాటు మామ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహేంద్రగఢ్ బైపాస్ రహదారిలో చోటు చేసుకుంది. స్కూటర్, బ్రెజ్జా కారు ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఘటన తెలిసిన వెంటనే హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్లారు షూటర్ మనూ బాకర్. ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు అమ్మమ్మ అన్నా, మామ అన్నా పంచ ప్రాణం. ఈ తరుణంలో ఇద్దరూ కూడా పైలోకాలకు వెళ్లడం బాధ కలిగించింది.
ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాద స్థలానికి ప్రధాన కారకుడు కారు డ్రైవర్ అని సమాచారం. అక్కడి నుంచి కారు డ్రైవర్ పారి పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.