SPORTS

ఆ హీరో అంటే ఇష్టం – మ‌ను

Share it with your family & friends

త‌ల‌ప‌తి విజ‌య్ పై కామెంట్స్

హైద‌రాబాద్ – ప్ర‌ముఖ భార‌తీయ రెజ్ల‌ర్ మ‌ను భాక‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఇప్పుడు చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌లే త‌ను త‌మిళ‌నాడులోని చెన్నైకి వెళ్లింది. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొంది. ఈ సంద‌ర్బంగా ఈ రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖులు ఎవ‌రైనా మీకు తెలుసా అని ప్ర‌శ్నించారు.

దీనికి స‌మాధానం చెబుతూ..త‌న‌కు డార్లింగ్ త‌ల‌ప‌తి విజ‌య్ అంటే చ‌చ్చేంత ఇష్ట‌మ‌ని చెప్ప‌డంతో అక్క‌డున్న వారంతా విస్మ‌యం చెందారు. తాజాగా ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ వేదిక‌గా జ‌రిగిన ఒలింపిక్స్ 2024లో రెండు ప‌త‌కాల‌ను సాధించింది. చ‌రిత్ర సృష్టించింది.

ఈ సంద‌ర్బంగా మ‌ను భాక‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు సినీ రంగాన్ని ఒక్క‌సారిగా కుదిపేశాయి. ఇది ప‌క్క‌న పెడితే త‌ల‌ప‌తి విజ‌య్ మేన‌రిజం త‌న‌కు న‌చ్చుతుంద‌ని తెలిపింది. తాజాగా విజ‌య్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు . త‌ను కొత్త పార్టీ పెట్టాడు. ఇక త‌మిళ‌నాడులో ఆయ‌న‌కు అత్య‌ధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

పాన్ ఇండియా హీరోగా ఇప్ప‌టికే గుర్తింపు పొందాడు. త‌ను అవినీతి, అక్ర‌మాలు, జీఎస్టీపై ఎక్కువ‌గా త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తుంటాడు. అంతే కాదు మోడీని, బీజేపీని ఏకి పారేస్తుంటాడు. కానీ త‌న సినిమాకు మినిమం గ్యారెంటీ అనేది త‌ప్ప‌కుండా ఉంటుంది.