రాహుల్ గాంధీని కలిసిన ఒలింపిక్ విజేత
మనూ భాకర్ ను అభినందించిన నేత
న్యూఢిల్లీ – పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ 2024లో భారత దేశం తరపున ప్రాతినిధ్యం వహించి ఏకంగా 2 పతకాలను గెలుచుకుని చరిత్ర సృష్టించిన మను భాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్నారు.
ఆమెతో పాటు తల్లిండ్రులు కూడా ఉన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ స్వయంగా సీట్లు పంచి పెట్టారు. మను భాకర్ ను ప్రశంసలతో ముంచెత్తారు కాంగ్రెస్ నాయకుడు. నీలాంటి వాళ్లు ఈ దేశానికి అవసరమని పేర్కొన్నారు.
ఒలింపిక్స్ లో ప్రదర్శించిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని ఈ సందర్బంగా చెప్పారు రాహుల్ గాంధీ. మను భాకర్ షూటింగ్ విభాగంలో సత్తా చాటారు. పారిస్ నుంచి వచ్చిన ఆమెకు ఘన స్వాగతం లభించింది.
అనంతరం తనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వస్తున్న రాహుల్ గాంధీని కలుసు కోవాలని అనుకున్నారు. ఇండియాకు వచ్చిన 2 రోజుల తర్వాత నేరుగా రాహుల్ నివాసం వద్దకు వెళ్లారు. అనంతరం మను భాకర్ మీడియాతో మాట్లాడారు.
దేశ ప్రధాని మోడీ, రాష్ట్రపతి ముర్ము, క్రీడా శాఖ మంత్రితో పాటు కోట్లాది మంది భారతీయులు తనను ప్రశంసలతో ముంచెత్తారని..వారికి పేరు పేరునా రుణపడి ఉంటానని అన్నారు. ఇదే సమయంలో తనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేసిన రాహుల్ గాంధీకి థ్యాంక్స్ తెలిపారు .