ఓటు ఆయుధం ప్రజాస్వామ్యానికి మూలం
కీలక వ్యాఖ్యలు చేసిన షూటర్ మనూ బాకర్
హర్యానా – ప్రముఖ షూటర్ మనూ బాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో జరిగిన ఎన్నికల సందర్బంగా ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలిసారి తన ఓటు వేయడం విశేషం. ఈ సందర్బంగా మనూ బాకర్ మీడియాతో మాట్లాడారు.
ఈ దేశ భవిష్యత్తు యువతపైనే ఉందన్నారు. మన దేశాన్ని బాగు చేసుకోవాలంటే కీలకమైన ఓటు విలువ తెలుసు కోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతాయుతమైన పౌరులుగా ఆలోచించాలని సూచించారు.
యువతీ యువకులు భారీ ఎత్తున మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటు వేశారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. అయితే తాను ఎవరికీ ఓటు వేశాననేది చెప్పలేదు మనూ బాకర్. యువత తలుచుకుంటే ఏదైనా సాధించ వచ్చని, అది తనను చూస్తే తెలుస్తుందన్నారు.
ఇదిలా ఉండగా ఇటీవలే ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో డబుల్ మెడల్స్ సాధించారు షూటింగ్ విభాగంలో. దేశ చరిత్రలో అరుదైన రికార్డ్ నమోదు చేశారు మనూ బాకర్. ఆమెకు ప్రస్తుతం 22 ఏళ్లు. ఎవరు మన కోసం పని చేస్తారని ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయాలని పిలుపు ఇవ్వడం విశేషం. చిన్న చిన్న అడుగులే భారీ లక్ష్యాలను ఛేదించేందుకు దోహద పడేలా చేస్తాయన్నారు మనూ బాకర్.