NEWSANDHRA PRADESH

లోకేష్ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు

Share it with your family & friends

ప్ర‌శంసించిన రెడ్ మీ హెడ్ జైన్

అమ‌రావ‌తి – రెడ్ మీ ఇండియా హెడ్ మ‌ను కుమార్ జైన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఏపీ ఐటీ, క‌మ్యూనికేష‌న్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇద్ద‌రి మ‌ధ్య టెక్నాల‌జీ ప‌రంగా, మొబైల్ క‌నెక్టివిటీ, రెడ్ మీ మొబైల్స్ , ఇత‌ర యాక్సెస‌రీస్ గురించి చ‌ర్చించారు.

ఈ సంద‌ర్బంగా నారా లోకేష్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. డైన‌మిక్ లీడ‌ర్ గా పేరు పొందిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు త‌గ్గ‌ట్టు ప‌ని చేస్తున్నార‌ని, టెక్నాల‌జీ ప‌ట్ల అద్భుత‌మైన ఆస‌క్తి, నేర్చు కోవాల‌న్న‌, తెలుసు కోవాల‌న్న త‌ప‌న నారా లోకేష్ లో చూశాన‌ని ప్ర‌శంస‌లు కురిపించారు మ‌ను కుమార్ జైన్.

త‌న‌ను క‌లుసు కోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. యువ డైన‌మిక్ లీడ‌ర్ అంటూ కితాబు ఇచ్చారు. అత‌డి ఉత్సాహం, నిబ‌ద్ద‌తను గ‌త 10 ఏళ్ల కింద‌ట చూశాన‌ని, ఆ త‌ర్వాత ఇప్పుడు కూడా అదే త‌న‌లో క‌నిపిస్తోంద‌ని తాను లోకేష్ ను చూసి విస్మ‌యానికి గురైన‌ట్లు తెలిపారు ఇండియా హెడ్.

ఏపీలో త‌యారీ ప్లాంట్ల‌ను స్థాపించ‌డంలో త‌న‌కు స‌హాయం చేశాడ‌ని, దానిని మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు మ‌ను కుమార్ జైన్. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భావితం చేస్తున్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించి లోకేష్ ఆస‌క్తిని చూసి విస్తు పోయాన‌ని పేర్కొన్నారు.