లావణ్య తప్పుడు ఆరోపణలు
హైదరాబాద్ – టాలీవుడ్ లో ఇప్పుడు రాజ్ తరుణ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి దాకా డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపితే ఇప్పుడు సదరు నటుడిపై లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది.
తాజాగా నటి మాల్వీ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేసింది. శనివారం ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించింది. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. సినిమాలు అన్నాక కలిసి చేయడం సహజమని పేర్కొంది.
ఇదే సమయంలో రాజ్ తరుణ్ తనకు అఫైర్ ఉందంటూ లావణ్య చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజ్ తరుణ్ తన సహచర నటుడు మాత్రమేనని స్పష్టం చేసింది మాన్వీ మల్హోత్రా. షూటింగ్ అయి పోయి ఆరు నెలలు కావస్తోందన్నారు.
అప్పటి నుంచి రాజ్ తరుణ్ తో తాను టచ్ లో లేనని తెలిపారు. తాను లావణ్యను బెదిరించ లేదని తెలిపింది. ఆమెతో తనకు పరిచయం లేదని పైగా తనను ఫోన్ చేసి వేధిస్తోందంటూ వాపోయింది. రాజ్ తరుణ్ తో నటించిన ప్రతి హీరోయిన్ ను అనుమానిస్తోందని ఆరోపించింది. అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించింది.