పవన్ కళ్యాణ్ పచ్చి అవకాశవాది
నిప్పులు చెరిగిన మావోయిస్ట్ గణేష్
అమరావతి – రాష్ట్ర ప్రజల కోసం జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పని చేయడం లేదని, కేవలం తన స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నాడని మావోయిస్ట్ నేత గణేష్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ను హెచ్చరిస్తూ లేఖ రాశారు. ప్రస్తుతం ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది.
జనసేన పార్టీ స్థాపించిన రోజు తమ పార్టీ కమ్యూనిస్టు భావజాలం కలిగి ఉందని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పోరాట వీరుడు చేగువేరాను పదే పదే వాడు కోవడాన్ని, ప్రస్తావించడాన్ని తప్పు పట్టారు.
వెకిలి వేషాలు వేస్తూ, రోజుకో మాట మాట్లాడే పవన్ కళ్యాణ్ కు ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మావోయిస్ట్ గణేష్. కానీ దేశంలో మావోయిస్టులను, ప్రజలను పక్కన పెట్టి, కేవలం బడా బాబులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతున్న బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధనాం లేదని స్పష్టం చేశారు మావోయిస్టు గణేష్. సినీ గ్లామర్ , కాపు కులస్తుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఓ వేదికగా మారిందంటూ మండిపడ్డారు. తన తీరు మార్చుకోక పోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.