మరాఠా పుణ్య భూమి గొప్పది – పవన్ కళ్యాణ్
మహనీయులు పుట్టిన మాగాణం ఇది
మహారాష్ట్ర – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరాఠా పుణ్య భూమి అని, ఈ నేలపై ప్రసంగించడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం డేగ్లూర్ సభలో ప్రసంగించారు. తాను ఇక్కడికి కేవలం ఓట్లు అడగడానికి రాలేదన్నారు. ఎందరో మహనీయులు పుట్టిన నేల, ఎందరో సాధువులు నడిచిన నేల, మహానుభావులు ఉన్న నేల మీద గౌరవం తెలపడానికి వచ్చాననని చెప్పారు.
చత్రపతి శివాజీ పుట్టిన నేల, మన హక్కుల మీద పోరాటం నేర్పిన నేల, స్వరాజ్యం అనే పదానికి అర్థం తెలిపిన నేలపై నాకు ఉన్న అభిమానాన్ని తెలియ చేసేందుకు మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కర్మ భూమిగా నిలచిన గొప్ప భూమి ఇది అన్నారు. బాలా సాహెబ్ ఠాక్రేను జీవించి ఉండగా కలిసే అవకాశం రాలేదన్నారు. అన్యాయాలు, అక్రమాలు ఎదిరించడంలో ఆయన నాకు బలమైన స్ఫూర్తి అని కొనియాడారు.
సనాతన ధర్మాన్ని ఏ మాత్రం భయపడకుండా పరిరక్షించడంలో తనకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయ వాదం అనే సిద్ధాంతానికి బాలాసాహెబ్ స్ఫూర్తి. ఏ విషయాన్ని అయినా ధైర్యంగా చెప్పడం.. నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండడం. అధికారంతో సంబంధం లేకుండా మన సిద్దాంతాలకు బలంగా కట్టుబడి ఉండడం తన నుంచి నేర్చుకున్నానని చెప్పారు డిప్యూటీ సీఎం.