మార్కస్ దెబ్బ చెన్నై అబ్బా
స్టోయినిస్ సూపర్ ఇన్నింగ్స్
చెన్నై – ఐపీఎల్ 2024లో చెన్నై వేదికగా జరిగిన కీలక లీగ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ దుమ్ము రేపింది. ఒక రకంగా చెప్పాలంటే ఆట ఏకపక్షంగా సాగింది. లక్నో బ్యాటర్లను ఏ మాత్రం చెన్నై బౌలర్లు ప్రభావం చూపించ లేక పోయారు. దంతో తమ స్వంత గడ్డపై ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్న సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో లక్నో ఆదిలోనే వికెట్లను కోల్పోయింది. క్వింటన్ డికాక్ డకౌట్ కాగా కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం 16 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టాడు.
పడిక్కల్ తో కలిసి మార్కస్ స్టోయినిస్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అద్బుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. 124 రన్స్ చేసి లక్నో సూపర్ జెయింట్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో లక్నో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించింది.