NEWSTELANGANA

ట‌చ్ లో ఉన్నా పార్టీని వీడ‌ను

Share it with your family & friends

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ కు దెబ్బ దెబ్బ త‌గులుతోంది. ఆ పార్టీని ఒక్క‌రొక్క‌రుగా వీడేందుకు ప్లాన్ చేసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. శ‌నివారం మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ తాటికొండ రాజ‌య్య రాజీనామా చేశారు. ఇప్ప‌టికే రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యేగా ఉన్న వ‌న్నాడ ప్ర‌కాశ్ గౌడ్ జంప్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు శాలువా క‌ప్పి ఆహ్వానించారు. ఆయ‌న‌ను తీసుకు రావ‌డంలో వేం న‌రేంద‌ర్ రెడ్డి పాత్ర ఉన్న‌ట్లు టాక్.

ఇది ప‌క్క‌న పెడితే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ వ‌స్త్రాల వ్యాపార‌వేత్త‌, జేసీ బ‌ద‌ర్స్ చీఫ్ , నాగ‌ర్ క‌ర్నూల్ మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న పార్టీ మారుతున్నారంటూ చ‌ర్చ జ‌రుగుతోంది.

దీనిపై తీవ్రంగా స్పందించారు మ‌ర్రి జ‌నార్ద‌న్ రెడ్డి. త‌న‌ను పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్ , బీజేపీ పార్టీల‌కు చెందిన కొంద‌రు నేత‌లు అడిగారంటూ బాంబు పేల్చారు. అయితే తాను ఏ పార్టీ లోకి వెళ్ల‌న‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. తాను ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌న‌ని, ఒక్క కేసీఆర్ కే జ‌వాబుదారీగా ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు జ‌నార్ద‌న్ రెడ్డి.