పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చితక బాదడం వల్లనే తెలకపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య చని పోయాడని ఆరోపించారు.
బంగారం చోరీ నెపంతో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారని , మానవత్వాన్ని మరిచి పోయి చితక బాదారని ఆరోపించారు. దీంతో భయ భ్రాంతులకు గురైన ఆటో వెంకటయ్య దెబ్బలకు తాళలేక మనస్తాపానికి గురయ్యాడని పేర్కొన్నారు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయరు మర్రి జనార్దన్ రెడ్డి.
వెంకటయ్యను దారుణంగా కొట్టడమే కాకుండా చిత్ర హింసలకు గురి చేసిన నాగర్ కర్నూల్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇక నుండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఓయనా కోరారు.