తెలంగాణ డీజీపీ కీలక నిర్ణయం
హైదరాబాద్ – రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకు డీజీపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున డీఎస్పీలను బదిలీ చేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సర్కార్ వచ్చాక ఏ ఒక్కరినీ ఒక చోటు కుదురుగా ఉండనీయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. బదిలీ అయిన వారిలో ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. పోస్టింగ్ ల వారీగా చూస్తే బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్ ,చిక్కడపల్లి ఏసీపీగా సిహెచ్ శ్రీకాంత్ , మాదాపూర్ ఏసీపీగా సిహెచ్ శ్రీధర్ , మేడ్చల్ ఏసీపీగా సిహెచ్ శంకర్ రెడ్డిని బదిలీ చేశారు.
ఇక సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్ , మలక్ పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి ,గాంధీనగర్ ఏసిపి గా ఏ యాదగిరి , ఎస్సార్ నగర్ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు , కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్ ,చాంద్రాయణగుట్ట ఏసిపి గా ఏ సుధాకర్ , కూకట్పల్లి ఏసీపీగా రవి కిరణ్ రెడ్డి , పేట్ బషీరాబాద్ ఏసిపి గా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ , మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి , షాద్ నగర్ ఏసీపీ గా ఎస్ లక్ష్మీనారాయణ ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి , గోషామహల్ ఏసిపి గా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి , చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి , మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య , అబిడ్స్ ఏసిపి గా పి ప్రవీణ్ కుమార్ ను బదిలీ చేశారు డీజీపీ.