కూటమిలో చేరబోమంటూ మాజీ సీఎం స్పష్టం
ఉత్తర ప్రదేశ్ – యూపీ మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ కుమారి మాయావతి బిగ్ షాక్ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోను పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా తమ కూటమిలో చేరాలంటూ ఒమర్ అబ్దుల్లా మాయావతికి ప్రతిపాదన చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కుమారి మాయావతి. తాము పొత్తుకు ఒప్పుకోమంటూ పేర్కొన్నారు.
1995లో ఎస్పీ కార్యకర్తల గెస్ట్ హౌస్ దాడిలో బీజేపీ తన ప్రాణాలను ఎలా కాపాడిందో కూడా మాయావతి గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ తనకు సహాయం చేయలేదని ఆమె మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఒమర్ అబ్దుల్లా పార్టీ మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చు కోవాలని అనుకుంటోంది.
ఈ తరుణంలో మాయావతి పొత్తు విషయంలో కొంత వెనక్కి తగ్గారు. ఒకవేళ పోటీ గనుక చేస్తే బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి మాయావతి.