సర్కార్ నిర్లక్ష్యం మాయావతి ఆగ్రహం
సత్సంగ్ ఘటనకు కారణం సీఎం యోగినే
ఉత్తర ప్రదేశ్ – బీఎస్పీ చీఫ్ , మాజీ సీఎం కుమారి మాయవతి నిప్పులు చెరిగారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఉన్నాడా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలోని సత్సంగ్ లో పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏకంగా 121 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు కుమారి మాయావతి.
దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు ప్రధానంగా బాధ్యత వహించాల్సింది సీఎం యోగి ఆదిత్యానాథ్ అంటూ స్పష్టం చేశారు. బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ ను పూర్తిగా కంట్రోల్ పెట్టాల్సిన సీఎం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె కోరారు.