జమిలి బిల్లుకు మాయవతి మద్దతు
పార్లమెంట్ లో ప్రవేశ పెట్టనున్న కేంద్రం
ఉత్తర ప్రదేశ్ – బీఎస్పీ అధ్యక్షురాలు కుమారి మాయావతి సంచలన ప్రకటన చేశారు. మోడీ ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వస్తున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. అయితే తాను బీజేపీ ఒత్తిడి తీసుకు రావడం వల్లనే సపోర్ట్ చేయడం లేదని స్పష్టం చేశారు. కాగా జమిలి ఎన్నికల ఆలోచనను మాజీ దివంగత రాష్ట్రపతి కలాం ఇచ్చారు.
మాయావతి మీడియాతో మాట్లాడారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ఎదగాలని, దేశం, ప్రజా ప్రయోజనాల కోసం పని చేయాలని అన్నారు. ప్రవర్తనా నియమావళిని సత్వరమే అమలు చేయకుంటే ప్రజా ప్రయోజనాల పనులపై పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు మాయావతి.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల భారం తగ్గుతుందన్నారు. ఈ అంశం ముసుగులో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. అన్ని పార్టీలు పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదిగి దేశ, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు బీఎస్పీ చీఫ్.
రాజ్యాంగానికి, దాని రూపకర్త డాక్టర్ భీంరావు అంబేద్కర్‌కు గౌరవం ఇచ్చే విషయంలో పాలక పార్టీలు తమ సంకుచిత ఆలోచనలు, కులతత్వ రాజకీయాల ద్వారా దానిని విఫలం చేసేందుకు ప్రయత్నించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి దేశానికి బాధాకరం, ప్రజల భవిష్యత్తుకు దురదృష్టకరం అన్నారు.