ఈసారి మార్పు ఖాయం
బీఎస్పీ చీఫ్ కుమారి మాయావతి
ఉత్తర ప్రదేశ్ – ఈసారి దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన దానికంటే ఆశ్చర్య కరమైన ఫలితాలు వెల్లడి కానున్నాయని స్పష్టం చేశారు బీఎస్పీ చీఫ్ , మాజీ యూపీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి.
సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గత కొంత కాలంగా పాలన సాగిస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇది రాబోయే ఫలితాలపై ప్రభావం చూపనుందని స్పష్టం చేశారు మాయావతి.
వ్యవస్థలను బాగు చేయాల్సిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వాటిని పట్టించు కోలేదని పేర్కొన్నారు. ఎన్నడూ లేనంతగా ఇవాళ అనిశ్చిత పరిస్థితి నెలకొందని, ఏ వర్గమూ సంతోషంగా లేదని తెలిపారు. కానీ మోదీ పదే పదే 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఒకే పార్టీ అధికారంలో ఉండడం కాదన్నారు. ప్రతిపక్షాలు కూడా బలంగా ఉన్నప్పుడే డెమోక్రసీకి విలువ అనేది ఉంటుందని స్పష్టం చేశారు కుమారి మాయావతి.