సునీత బాటలో మేకల కావ్య
బీఆర్ఎస్ షాక్ మరో వికెట్ ఔట్
హైదరాబాద్ – నిన్నటి దాకా ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఒకరిని విడిచి మరొకరు పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. మరికొందరు కూడా లైన్ లో ఉన్నట్టు సమాచారం.
శుక్రవారం మరో వికెట్ పడింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి షాక్ ఇచ్చారు. తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదువలకు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు లేఖను పంపించారు.
ఇదిలా ఉండగా మరో సీనియర్ నాయకురాలు, జవహర్ నగర్ మేయర్ గా ఉన్న మేకల కావ్య ఉన్నట్టుండి పార్టీని వీడనున్నట్లు సమాచారం. ఈమేరకు పార్టీకి, సభ్యత్వానికి, పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.
ఇప్పటి వరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ , పెద్దపల్లి ఎంపీ వెంకేటశ్ నేత తో పాటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ కూడా జంప్ అయ్యారు. రాబోయే రోజుల్లో ఇంకెంత మంది చేరుతారో చూడాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య.