Wednesday, April 9, 2025
HomeNEWSANDHRA PRADESHస‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి సారిస్తా

స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి సారిస్తా

ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ తిరుమ‌ల రావు

విజయవాడ : ఆర్టీసి హౌస్ లో ఆర్టీసీ వీసి, యం.డి ద్వారకా తిరుమల రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సంస్థ‌లో అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. త‌ను నూత‌న ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సంద‌ర్బంగా వివిధ ఉద్యోగ సంఘాల నేత‌లు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌న‌కు పుష్ప గుచ్ఛాలు ఇచ్చి శాలువ‌తో స‌న్మానించారు.

ఏపీ జేఏసీ అమరావతి పక్షాన చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి ఆద్వర్యంలో సత్కరించారు. ఈ సందర్భంగా వారితో ఆర్టీసీ ఉద్యోగులు, సెక్యూరిటీ స్టాఫ్ తదితర ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన అనంతరం ఏర్పడిన సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలను వారి దృష్టికి తీసుకుని వెళ్ళగా తప్పకుండా అన్ని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు.

ఆర్టీసీ వీసి, యం.డి ని కలిసిన వారిలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిసెట్టి రాజేష్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యం.శంకర్ రావు, కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్ష‌, ప్రధాన కార్యదర్శులు శేషగిరి రావు, శ్రీనివాసరావు, ఆర్టీసీ సెక్యూరిటీ ఉద్యోగుల సంఘం పక్షాన మల్లికార్జున, మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీ.నాగేశ్వర రావు, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్యా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సుమన్, సహా అధ్యక్షులు సంపత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments