కేసు వేసిన ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా
న్యూఢిల్లీ – ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. శుక్రవారం అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరు పర్చనున్నారు. ఎల్జీ కేసులో కోర్టుకు హాజరు కాక పోవడం, శిక్షా ఉత్తర్వులను పాటించక పోవడం పట్ల కోర్టు సీరియస్ అయ్యింది. 2001లో తనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. ప్రొబేషన్ బాండ్లు, లక్ష రూపాయల జరిమానాను సమర్పించాలన్న శిక్షా ఉత్తర్వులను పాట్కార్ ఉద్దేశ పూర్వకంగానే ఉల్లంఘిస్తోందంటూ మండిపడింది.
ఏప్రిల్ 8 నాటి శిక్షను పాటించడానికి కోర్టుకు హాజరు కావడానికి బదులుగా, 70 ఏళ్ల సామాజిక కార్యకర్త గైర్హాజరు అయ్యారని, పరిహారం మొత్తాన్ని అందించడానికి లోబడి ప్రొబేషన్ ప్రయోజనాన్ని పొందాలనే ఆదేశాన్ని ఉద్దేశ పూర్వకంగా పాటించడంలో విఫలమయ్యారని అదనపు సెషన్స్ జడ్జి విశాల్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషి మేధా పాట్కర్ ఉద్దేశ్యం ఏమిటంటే, ఆమె ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘిస్తోందని స్పష్టంగా తెలుస్తుంది; ఆమె కోర్టుకు హాజరు కాకుండా , శిక్ష నిబంధనలను అంగీకరించకుండా తప్పించుకుంటోందంటూ జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.