ప్రశంసలు కురిపించిన మీనాక్షి నటరాజన్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిగ్ వర్కర్స్ హక్కుల కోసం అలుపెరుగని రీతిలో తన జీవితాన్ని అంకితం చేసిన గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ పై ప్రశంసలు కురిపించారు. వారి హక్కుల కోసం తను నిరంతరం పోరాడుతూ ఉండడం అభినందనీయమన్నారు.
ఈ విషయంలో షేక్ సలావుద్దీన్ దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. ఇవాళ ఎన్ఏపీఎం కీలక సమావేశం జరిగింది. ఈ సమవేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మీనాక్షి నటరాజన్.
దేశ వ్యాప్తంగా గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ సమస్యలు అన్నీ ఒకేలా ఉన్నాయని అన్నారు. వారి హక్కుల సాధన కోసం జాతీయ స్థాయి పోరాటం అవసరమని అభిప్రాయం వ్యకత్ం చేశారు.
ఈ సందర్భంగా షేక్ సలావుద్దీన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వర్కర్స్ హక్కుల కోసం చేస్తున్న పోరాటం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిందన్నారు. అంతే కాకుండా తెలంగాణ రాజకీయాలలో కూడా సలావుద్దీన్ కీలకమైన వ్యక్తిగా మారారని అన్నారు మీనాక్షి నటరాజన్. గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ కు రోల్ మోడల్‌గా నిలిచారని ప్రశంసించారు.
వర్కర్స్ సమస్యలను పార్లమెంటులో ఎంపీలు ప్రస్తావించడం చాలా కీలకమని ఆమె పేర్కొన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని యువత కూడా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు.