కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్
హైదరాబాద్ – పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్. పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో ప్రసంగించారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ మనదని, ఆ విషయం ఎవరూ మరిచి పోవద్దని అన్నారు. బ్రిటీష్ వారితో పోరాడిన పార్టీ మనదన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన వారి గురించి తనకు తెలుసన్నారు. తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు మీనాక్షి నటరాజన్. ప్రతి ఒక్కరు కీలకమైన వారేనని, ఆ విషయం నేతలు గుర్తించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. దీని గురించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తులు ఎవరంటే నాయకులు కాదని కార్యకర్తలని అన్నారు. మీరు లేక పోతే పార్టీ మనుగడ సాగించడం కష్టమన్నారు మీనాక్షి నటరాజన్.