Wednesday, April 2, 2025
HomeOTHERSEDITOR'S CHOICEమీనాక్షి న‌ట‌రాజ‌న్ తెలంగాణ ఆప‌రేష‌న్

మీనాక్షి న‌ట‌రాజ‌న్ తెలంగాణ ఆప‌రేష‌న్

హ‌స్తం పార్టీలో కాకా రేపుతున్న ఇంఛార్జ్
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ స‌ముద్రం. స్వేచ్ఛ ఎక్కువ‌. ఎవ‌రైనా స‌రే దేని గురించైనా మాట్లాడ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిన్న‌టి దాకా సీఎం రేవంత్ రెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు ఆ పేరు స్థానంలో కొత్త పేరు వినిపిస్తోంది. ఆ పేరు ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. పార్టీలోనే కాదు ఇత‌ర పార్టీల నేత‌ల‌ను సైతం విస్తు పోయేలా చేస్తోంది. ఇంత‌కీ ఎవ‌రు అనుకుంటున్నారా..మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన నిబ‌ద్ద‌త‌, నిజాయితీకి కేరాఫ్ గా నిలిచిన మీనాక్షి న‌ట‌రాజ‌న్. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాప కింద నీరులా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది.

త‌ను ఏఐసీసీ సీనియ‌ర్ నాయ‌కుడు రాహుల్ గాంధీ టీంలో త‌ను కీల‌క‌మైన స‌భ్యురాలు. నిన్న‌టి దాకా ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న రీతిలో వ్య‌వ‌హ‌రించిన నేత‌ల‌ను ఒకే తాటిపైకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ్రౌండ్ లో పార్టీ ప‌ట్ల ఎందుకంత వ్య‌తిరేక‌త వ‌స్తోంద‌న్న దానిపై ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా ఏర్పాటు చేసిన కీల‌క స‌మావేశంలో సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పార్టీలో 10 ఏళ్ల నుంచి ప‌ని చేసిన వారికే ప‌ద‌వుల‌లో ప్ర‌యారిటీ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. మొత్తంగా తెలంగాణ ఆప‌రేష‌న్ స్టార్ట్ చేసింద‌ని తేలి పోయింది. పార్టీనే ఫైన‌ల్ .. వ్య‌క్తులు ముఖ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక మీనాక్షి న‌ట‌రాజ‌న్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ స‌భ్యురాలిగా ఉన్నారు. 15వ లోక్ స‌భ కు ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హించారు. బిర్లా గ్రామ్ నాగ్ధా స్వ‌స్థ‌లం. జూలై 23, 1973లో పుట్టారు. విద్యాధికురాలు కూడా. సింప్లిసిటీ ఆమె ప్ర‌త్యేక‌త‌. సాహిత్యం ప‌ట్ల మ‌క్కువ ఎక్కువ‌. న‌వ‌లా ర‌చ‌యిత్రిగా గుర్తింపు పొందారు. రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్‌ సంఘటన్‌ జాతీయ అధ్యక్షురాలుగా ప‌ని చేశారు. 2009లో బీజేపీ అభ్య‌ర్థిని ఓడించి చ‌రిత్ర సృష్టించారు. భుజానికి ఓ బ్యాగ్, ఎలాంటి వాహ‌నం , హంగు ఆర్భాటం లేకుండా ట్రైన్ లో హైద‌రాబాద్ కు వ‌చ్చి అంద‌రినీ విస్తు పోయేలా చేశారు.

2023లో తెలంగాణ శాస‌న స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో మీనాక్షి న‌ట‌రాజ‌న్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కురాలిగా వ్య‌వ‌హ‌రించారు. పార్టీ హైక‌మాండ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గాడి త‌ప్పిన కాంగ్రెస్ పార్టీని ప్లాట్ ఫామ్ మీద‌కు తీసుకు వ‌చ్చేందుకు త‌న‌ను తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ గా నియ‌మించింది. ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్య‌క్షురాలిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం త‌ను హాట్ టాపిక్ గా మారారు. సండే న‌వ జీవ‌న్ కు స‌మ‌కాలీన అంశాల‌పై రాస్తు వ‌స్తున్నారు. మీనాక్షి న‌ట‌రాజ‌న్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ కమిటీ, మహిళా సాధికారత కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. ప్ర‌స్తుతం త‌న ఆప‌రేష‌న్ ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments