మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్
తమ్ముడూ నిండు నూరేళ్లు ఉండాలి
హైదరాబాద్ – తన సోదరుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. నీలాంటి సోదరుడు తనకు ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుటున్నట్లు తెలిపారు చిరంజీవి.
ప్రతి సంవత్సరం నీకు పుట్టిన రోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టిన రోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో, కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి ..వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడంటూ కొనియాడారు మెగాస్టార్.
రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం కల్పించారంటూ ప్రశంసలు కురిపించారు.
అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉందని స్పష్టం చేశారు మెగాస్టార్. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు అన్నయ్యగా.