జర్నలిస్ట్ మూవీ టీజర్ లాంచ్
మెగాస్టార్ కు మూర్తి థ్యాంక్స్
హైదరాబాద్ – తెలుగు వారందరికీ సుపరిచితమైన జర్నలిస్టులలో ఒకరు మూర్తి. పరిశోధనాత్మక కథనాలను ప్రసారం చేయడంలో కీలకంగా ఉన్నారు. ఆ మధ్యన మాజీ గవర్నర్ పై ప్రసారం చేసిన సీక్రెట్ ఆపరేషన్ స్టోరీ అప్పట్లో సంచలనం కలిగించింది. చివరకు గవర్నర్ కూడా బదిలీపై వెళ్లారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఒక్క స్టోరీతో వెలుగులోకి వచ్చారు మూర్తి.
ప్రస్తుతం ఆయన ఓ న్యూస్ ఛానల్ లో పని చేస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాల పట్ల మంచి పట్టు కలిగిన మూర్తి జర్నలిస్ట్ గా ఓ వైపు పని చేస్తూనే మరో వైపు సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు. ఆపై దర్శకుడిగా మారారు. ఈ సందర్బంగా తాను రూపొందించిన మూవీకి సంబంధించి కీలక సమాచారం వెల్లడించారు.
శుక్రవారం ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు జర్నలిస్ట్ మూర్తి. తన సినిమాకు సంబంధించిన టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారని వెల్లడించారు. ఈ సందర్బంగా తాను మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని పేర్కొన్నారు మూర్తి. ఇక సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.