జనసేన పార్టీకి మెగాస్టార్ విరాళం
పవన్ కళ్యాణ్ ప్రయత్నం గొప్పది
అమరావతి – సాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన గతంలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు. ఆ పార్టీకి ఆశించిన స్థానాలు రాలేదు. దీంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర కేబినెట్ లో స్థానం పొందారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. సినిమాలలో బిజీగా మారి పోయారు. ప్రస్తుతం ఫుల్ ఖుష్ లో ఉన్నారు.
అయితే పట్టు వదలని విక్రమార్కుల్లా తన సోదరులు పవన్ కళ్యాణ్, కొణిదెల నాగేంద్ర బాబు ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. ప్రస్తుతం పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు నాగేంద్ర బాబు.
అధికారంలో లేక పోయినా తన సోదరుడు పవన్ కళ్యాణ్ ఇతోధికంగా సహాయం చేస్తూ వస్తున్నాడని పేర్కొన్నారు చిరంజీవి. తన సంపాదనను రైతు కూలీల కోసం వినియోగించడం తనకు సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తమ్ముడి లక్ష్యానికి కొంతైనా సాయం చేయాలని తాను కూడా తన వంతుగా విరాళం అందజేశానని స్పష్టం చేశారు చిరంజీవి.