అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి
హైదరాబాద్ – అందరి వాడైనా మెగాస్టార్ చిరంజీవి అరుదైన ఘనత సాధించారు. మొగల్తూరులో పుట్టిన కొణిదల చిరంజీవి ఊహించని విధంగా నిబద్దతతో, స్వయం కృషితో పైకి వచ్చారు. భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్నారు చిరంజీవి. ఆయనను అంతా మెగాస్టార్ గా గుర్తింపు పొందారు.
ఈ స్థాయిలో ఎదగడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. లక్షలాది మందికి రక్త దానం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఎంతో మందికి గుప్త దానాలను చేస్తూ వస్తున్నారు.
పద్మ భూషణ్ అత్యున్నతమైన పురస్కారం అందుకున్నారు చిరంజీవి. అరంగేట్రం నుండి ఆధిపత్యం వరకు చిరంజీవి సాగించిన ప్రస్థానం అద్బుతం అని చెప్పక తప్పదు.
1978లో ఇదే రోజున చిరంజీవి తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు 46 సంవత్సరాల తరువాత, ప్రపంచం అతని అసమానమైన వారసత్వాన్ని భారతీయ సినిమాలో అత్యంత ఫలవంతమైన స్టార్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌తో జరుపు కోవడం విశేషం.
ఇప్పటి వరకు తన సినీ రంగ కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి 156 సినిమాలలో నటించారు. 537 పాటలలో డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. లక్షలాది మందికి స్పూర్తిగా నిలుస్తూ వచ్చారు మెగాస్టార్. ఈ సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరంజీవిని అభినందనలతో ముంచెత్తారు.