పుకార్లను నమ్మవద్దని విన్నపం
తన తల్లి అంజనాదేవి ఆరోగ్యం గురించి స్పందించారు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి. తన తల్లికి బాగోలేదని, ఆస్పత్రిలో చేర్పించామంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి లాగే జనరల్ పరీక్షలు నిర్వహించామని, ఆమె ఆరోగ్యం ప్రస్తుతం పదిలంగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది అంటూ లేదని స్పష్టం చేశారు. మెగా అభిమానులు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని ఈ సందర్బంగా చిరంజీవి కోరారు.
తన తల్లి అంజనమ్మ ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను మెగాస్టార్ చిరంజీవి తోసిపుచ్చారు. గత కొన్ని రోజులుగా, అంజనమ్మ ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారని మీడియాలో పుకార్లు వస్తున్నాయని అందుకనే వివరణ ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
తన తల్లి అంజనమ్మ “అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు” అనే పుకార్లను మెగాస్టార్ చిరంజీవి తోసిపుచ్చారు. అంజనమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, చాలా బాగానే ఉన్నారని ఆయన తన అభిమానులు, అనుచరులు, అందరికీ స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా, అంజనమ్మ ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారని మీడియాలో పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఈ పుకార్లు చివరికి మెగాస్టార్ వద్దకు చేరాయి, ఆయన వెంటనే వాటిని ఖండించారు.
చిరంజీవి ట్వీట్ చేస్తూ, “మా అమ్మ అనారోగ్యంతో ఉందని, ఆసుపత్రిలో చేరిందని సూచించే కొన్ని మీడియా నివేదికలను నేను చూశాను. ఆమె రెండు రోజులుగా కొద్దిగా అనారోగ్యంతో ఉన్నారని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఆమె ఆరోగ్యంగాచ, హృదయపూర్వకంగా ఉన్నారని స్పష్టం చేశారు.